మలయాళంలోకి నాగార్జున

By iQlikMovies - May 09, 2018 - 18:09 PM IST

మరిన్ని వార్తలు

కింగ్ నాగార్జున పోయిన ఏడాది రాజు గారి గది 2 చిత్రంలో నటించాక మరే ఇతర చిత్రాల్లో నటించలేదు. కారణం ఆయన చిన్న కొడుకు హలో సినిమాని అన్ని విధాలుగా దగ్గరుండి మరి చూసుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన చాలా కాలం తరువాత దర్శకుడు ఆర్జీవీతో ఆఫీసర్ అనే ఓ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తవ్వగా వచ్చే నెలలో ఈ చిత్రం విడుదలకానుంది. దీనితో ఈ చిత్రం పైనే అందరి ఆసక్తి నెలకొని ఉంది.

ఇవన్ని పక్కన పెడితే, నాగార్జున త్వరలోనే మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నాడు అన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించబోయే మలయాళ చిత్రంలో అక్కడి సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ తో పాటుగా ఆ చిత్రంలో మల్టీ స్టారర్ చేయనున్నాడట.

త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుందట. ఇక ప్రస్తుతం నాగార్జున తెలుగులో నాని తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నాడు, ఆ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS