సంపూర్ణేష్ బాబు. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బర్నింగ్ స్టార్‌గా సినిమాల్లో ఎంట్రీకి ముందే బోలెడంత క్రేజ్ సంపాదించేశాడీ హీరో.
ఈ సంగతి పక్కన పెడితే, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా గ్రాస్ 225 కోట్లు దాటింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన 'భరత్ అనే నేను' 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇదంతా వాస్తవం. అయితే ఆయా సినిమాల సక్సెస్‌ని గురించి కోట్లలో పబ్లిసిటీ చేసుకోవడం మామూలే. అయితే ఇంకా విడుదల కాకుండానే సంపూర్ణేష్ బాబు సినిమా 'కొబ్బరి మట్ట'కి వీకెండ్ కలెక్షన్లు 223 కోట్లు అంటూ పబ్లిసిటీ మొదలెట్టారు.
ఇదేం పబ్లిసిటీ అంటూ దాంతో పెద్ద హీరోల అభిమానులు బాగా హర్టయ్యారు. సంపూర్ణేష్‌బాబును సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఫన్ కోసమే అలా పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప, ఎవరినీ కించపరచడానికి కాదు అని 'కొబ్బరిమట్ట' టీమ్ చెబుతోంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం రిలీజ్ కావల్సిన సినిమా 'కొబ్బరిమట్ట'. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలోనే చిత్ర యూనిట్ ఈ విధంగా పబ్లిసిటీ షురే చేసిందన్న మాట.