సంక్రాంతి బరిలో పోటీకి దిగిన నాలుగు సినిమాల్లో ఒక్కొక్కటి ఒక్కో జోనర్ కావటం, ఏ సినిమాకి అదే ప్రత్యేకతను చాటుకుంది. హనుమాన్ సూపర్ హీరో కథతో వచ్చి విజివల్ వండర్ గా అలరించింది. గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది, వెంకటేష్ మూవీ కూడా పరవాలేదనిపించినా కలెక్షన్స్ విషయంలో వెనక పడింది. మిగతా సినిమాలు దాదాపుగా వసూళ్లు సాధించి, ఊపిరి పీల్చుకున్నాయి. నాగార్జున, అషికా రంగనాథ్ కాంబినేషన్ లో విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన నా సామిరంగ మూవీ 14 న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ తో, ఫుల్ రన్ తో భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
నాగార్జున సంక్రాతి హీరో అని మరోసారి నిరూపించుకున్నారు. ఇది వరకు కూడా సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా నా సామిరంగ మూడు సినిమాలతో పోటీ పడి విజయం సాధించింది. నైజాంలో కోటీ 20 లక్షలు, సీడెడ్ ఏరియాలో 85 లక్షల రూపాయల కలెక్షన్లు సాధించింది. గుంటూరులో 47 లక్షలు, వైజాగ్ లో 50 లక్షలు, ఉభయ గోదావరి జిల్లాలలో 90 లక్షలు, కృష్ణా జిల్లాలో 23 లక్షలు, నెల్లూరులో 18 లక్షలు, కలెక్షన్లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4.33 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకొంది. మల్టీప్లెక్స్ లలో అదిరిపోయే బుకింగ్స్ తో ఈ సినిమా సత్తా చాటుతుండటం గమనార్హం. నా సామిరంగ సక్సెస్ తో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాకు 20 కోట్ల బిజినెస్ జరుగుతుండగా, ఫస్ట్ వీక్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.