'ఆఫీసర్‌' అదరగొట్టేశాడుగా.!

By iQlikMovies - April 09, 2018 - 11:37 AM IST

మరిన్ని వార్తలు

'మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేయడం నా బాధ్యత' అంటున్నాడు మన ఆఫీసర్‌. అదేనండీ నాగార్జున. నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'ఆఫీసర్‌' చిత్రంలోనిదీ డైలాగ్‌. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్‌ని విడుదల చేశారు. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే యాంగిల్‌ని దృష్టిలో పెట్టుకుని టీజర్‌ని కట్‌ చేశారు. 

'హైద్రాబాద్‌ నుండి వచ్చి ముంబైలో మనల్ని పీకుతాడా..' అని విలన్‌ చెప్పే డైలాగులు, యాక్షన్‌ హీరోగా నాగార్జున అప్పియరెన్స్‌ మెయిన్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి టీజర్‌కి. అలాగే ఎప్పటిలాగే మన్మధుడు నాగార్జున ఫిట్‌ బాడీతో హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. హీరోయిన్‌ మిరా సరీన్‌ కాస్త హాట్‌గా, యాక్షన్‌ గాళ్‌లాగే కనిపిస్తోంది. ఓ పాపని కాపాడే నేపథ్యం చుట్టూ సాగే కథ ఇది.

'ఈ జాబ్‌ చేయడం అంత అవసరమా..' అని ఆ పాప చెప్పే డైలాగ్‌ కూడా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. పోలీసాఫీసర్‌గా ఖాకీ డ్రస్సులో కనిపించలేదు కానీ, మన ఆఫీసర్‌ చాలా డిగ్నిఫైడ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఒక చోట మిల్టరీ యూనిఫాంలో కూడా కనిపించాడు నాగార్జున. వేలు చూపిస్తూ, నాగార్జున ఎవరినో బెదిరిస్తున్నట్లుగా పవర్‌ఫుల్‌గా టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. 

గతంలో నాగార్జున - వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'శివ' తర్వాత ఆ స్థాయి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. టీజర్‌ ఫర్వాలేదనిపిస్తోంది ఇప్పటికైతే. చూడాలి మరి సినిమా ఏం చేస్తారో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS