స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొన్నిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వ్యాఖ్యలు ఇప్పుడు బన్నీ తలకి చుట్టుకున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే, ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ ని- మీరు జీవితంలో ఎవరిని స్పూర్తిగా తీసుకుంటారు? అని అడగగా- ఆయన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడి అని సమాధానం ఇచ్చాడు. ఇక ఈ విషయం ఇప్పుడు బయటకిరావడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ‘ప్రత్యేక హోదా’కి సంబంధించి పోరాటాలు నడుస్తున్న వేళ ఈ కామెంట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న వారు హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా గర్హిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో ఆయన వెనుకాడుతుండడంతో ఆయనని స్పూర్తిగా ఎలా తీసుకుంటారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా ఎప్పుడో అన్న వ్యాఖ్యకి ఇప్పుడు విమర్శలు ఎదురుకుంటున్నాడు బన్నీ.