అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ ఎనర్జీ అనే స్థాయిలో రామ్గోపాల్ వర్మ, నాగార్జున స్టార్డమ్ని ఎలివేట్ చేయబోతున్నాడట 'ఆఫీసర్' సినిమా కోసం. నిజమే, 'ఆఫీసర్' సినిమా నాగార్జున కంటే ఎక్కువగా రామ్గోపాల్ వర్మకే అత్యంత ప్రతిష్టాత్మకం. సాధారణంగా ఏదన్నా సినిమా తెరకెక్కించేటప్పుడు, ఆ సినిమా అంత విజయం సాధిస్తుంది, ఇంత విజయం సాధిస్తుందనే మాటలు వర్మ నుంచి విన్పించవు.
కమిట్మెంట్తో సినిమా చేయడం మాత్రమే తన పని అనుకుంటాడాయన. ఇక, వర్మ ఏం చేసినా దాని చుట్టూ వివాదాలు తప్పవు గనుక, ఆయా సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీ రావడం మామూలేననుకోండి. అది వేరే సంగతి. అయితే ఇటీవల తాను చేసిన సినిమాలన్నిటిలోకీ భిన్నమైనదిగా 'ఆఫీసర్' గురించి వర్మ చెబుతున్నాడు. తనకు డైరెక్టర్గా తొలి ఛాన్స్ ఇచ్చిన నాగార్జునతో చాలా గ్యాప్ తర్వాత వర్మ చేస్తోన్న 'ఆఫీసర్' సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. 'నాలో జ్యూస్ ఇంకా అయిపోలేదు' అని 'ఆఫీసర్' సినిమా ప్రారంభోత్సవంలోనే వర్మ చెప్పాడు. అలా వర్మ చెప్పడానికి కారణమేంటో అందరికీ తెల్సిందే.
ఇటీవలి వైఫల్యాలు ఆయన మీద అనుమానాల్ని కలగజేశాయి. కానీ, అలా అందరూ తనను లైట్ తీసుకుంటోన్న టైమ్లో బౌన్స్ బ్యాక్ అవడం వర్మ స్పెషాలిటీ. ఇప్పుడీ 'ఆఫీసర్'తో ఇంకోసారి వర్మ తన సత్తా చాటబోతున్నాడట. నాగార్జున తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోననీ, 'శివ' తర్వాత అంతటి సెన్సేషన్ 'ఆఫీసర్' కాబోతోందని వర్మ అంటున్నాడు.
మే 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త భామ మిరా సరీన్ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించబోతోంది.