నాగార్జున - కాజల్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అగ్ర కథానాయకుడు, నాయిక కలిసి నటించడం విశేషం.. ఏమీ లేదు. అది మామూలే. కానీ... నాగ్, కాజూ కలవడం మామూలు విషయం ఏమీ కాదు. ఎందుకంటే..కాజల్ ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లయ్యింది. ఇప్పటి వరకూ అగ్ర హీరోలందరితో నటించింది. కానీ.. నాగార్జునతో మాత్రం సినిమా చేయలేదు. దానికీ ఓ కారణం ఉంది. గతంలో నాగచైతన్య - కాజల్ కలిసి ఓ సినిమాలో నటించారు. అదే.. `దడ`. ఆసమయంలో కాజల్ చాలా ఇబ్బంది పెట్టిందట.
షూటింగులకు సరిగా వచ్చేది కాదట. కాజల్ వల్ల.. షూటింగు ఆలస్యం అయ్యేదట. దాంతో నాగ్ ఓసారి కాజల్ కి కాల్ చేసి.. వార్నింగ్ కూడా ఇచ్చినట్టు టాక్. అందుకే అప్పటి నుంచి అక్కినేని కాంపౌండ్ లో కాజల్ మరో సినిమా చేయలేదు. ఇంతకాలానికి నాగార్జునతో సినిమాకి ఓకే చెప్పింది. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. అంటే... అప్పటి గొడవని అటు నాగ్, ఇటు కాజల్ ఇద్దరూ మర్చిపోయినట్టే అనుకోవాలి. ఇండ్రస్ట్రీలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు రావడం, సర్దుకుపోవడం కామనే. కాకపోతే... `దడ` విడుదలై చాలా కాలమైంది. అప్పటి నుంచీ కాజల్ - నాగ్ సినిమా చేయలేదంటే.. ఇద్దరూ ఆ ఎపిసోడ్ ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవొచ్చు. ఏదైతేనేం.. ఇప్పటికి ఇద్దరూ శాంతించారు. అదే చాలు.