ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న భారీ చిత్రాన్ని ప్రకటించారు.
ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ప్రవీణ్ సత్తారు రచన, దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.