ఇప్పుడంతా ఓటీటీ హావానే. వెబ్ సిరీస్‌ల సంఖ్య ఎక్కువవుతోంది. తెలుగులోనూ వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులు పెరుగుతున్నాయి. స్టార్ దర్శకుల దృష్టి ఓటీటీపైపడింది. ఇప్పటికే క్రిష్ లాంటి వాళ్లు ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌లు రూపొందిస్తున్నారు. హరీష్ శంకర్,మెహర్ రమేష్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. పూరి కూడా ఓ వెబ్ సిరీస్ రూపొందించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలో కొరటాల శివ కూడా చేరారు. ఆహా కోసం కొరటాల ఓ వెబ్ సిరీస్ మొదలెట్టారు.
అయితే ఈ వెబ్ సిరీస్‌కి ఆయన దర్శకుడు కాదు. కేవలం కథ అందిస్తారంతే. తన శిష్యుడు కిరణ్ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తారు. దర్శకత్వ పర్యవేక్షణ అంతా కొరటాలనే చూసుకుంటారు. లాక్ డౌన్ లో చాలామంది దర్శకులకు వీలైనంత సమయం దొరికింది. ఈ టైమ్ ని వెబ్ సిరీస్‌ల కోసం కేటాయించారు. కొరటాల కూడా అంతే. ఈ గ్యాప్‌లో ఆచార్య స్క్రిప్టు పూర్త చేసి, బన్నీ కోసం ఓ లైన్ సిద్ధం చేసి, ఇప్పుడు వెబ్ సిరీస్ లోనూ అడుగుపెట్టారు. ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.