నాగార్జునతో భారీ యాక్షన్ ప్లాన్ చేసిన దర్శకుడు!

మరిన్ని వార్తలు

కింగ్ నాగార్జున గత ఏడాది విడుదలైన మన్మధుడు 2 చిత్రం తో అభిమానులను నిరాశపరిచినా.. బిగ్ బాస్ షో తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తన తదుపరి చిత్రాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు నాగ్. వాటిలో మొదటిది 'వైల్డ్ డాగ్'. సోలమన్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం లో సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.

 

ఈ చిత్రం తరువాత నాగ్ 'సోగ్గాడే చిన్ని నాయన' సీక్వెల్ 'బంగార్రాజు' మొదలు పెట్టనున్నట్టు వార్తలొచ్చాయి కానీ, ఈలోగా ప్రవీణ్ సత్తారు తో ఓ సినిమా చేయబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. 'గరుడ వేగా' వంటి యాక్షన్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న ప్రవీణ్ నాగార్జున తో కూడా అంతకుమించిన మరో యాక్షన్ థ్రిల్లర్ కథ చేయబోతున్నాడట. బంగార్రాజు కంటే ముందు ఈ చిత్రం మొదలవుతుందట.

 

ఈ నెల చివరి వారం లో ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి వార్తలొస్తున్నాయి. రాజశేఖర్ కి కంబ్యాక్ చిత్రాన్ని ఇచ్చిన ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునను ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS