ఓటీటీ కీ థియేటర్‌కీ మధ్య గట్టి పోటీ నడుస్తోందిప్పుడు. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. థియేటర్లో విడుదలైనా.. ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు. ఓటీటీల వల్ల థియేటర్ల ఆదాయానికి గండి పడింది. ఈ నేపథ్యంలో.. థియేటర్ వ్యవస్థని కాపాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు నిర్మాతలు. సినిమాని నేరుగా థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి విడుదల చేస్తున్నారు.
విక్కీ కౌశల్ కథానాయకుడిగా ఆనంద్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. జులై 28న ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ, థియేటర్‌లోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఓ సినిమాని ఇలా ఓటీటీలోనూ, థియేటర్లలోనూ ఒకేసారి రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. అమేజాన్ ప్రైమ్ ఈ మేరకు చిత్ర నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఫార్మెట్ సక్సెస్ అయితే... ఇక మీదట ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.