అక్కినేని నాగార్జున 'రాజుగారి గది-2' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. దర్శకుడు ఓంకార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పాండిచ్చేరిలో సినిమా షూటింగ్ జరుగుతోంది. సముద్రం ఒడ్డున నాగార్జున స్టైలిష్‌గా ఓ పోజిచ్చాడు. ఆ ఫొటోని సోషల్ మీడియాలో పెట్టాడు. 'సో బ్యూటిఫుల్ అండ్ మిస్టీరియస్' అని కామెంట్ కూడా పెట్టడంతో సినిమాలో సముద్రం మిస్టరీ ఏంటి? అనే చర్చ మొదలైంది. సమంత కూడా పాండిచ్చేరిలో నాగార్జునతో కలిసి షూటింగ్‌లో పాల్గొంది. సమంతది కీలక పాత్రే కానీ, గెస్ట్ రోల్‌లో కాస్సేపు కనిపిస్తుందట. కొత్త వాళ్లతో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్‌తోనే సంచలనాత్మక విజయం సాధించాడు డైరెక్టర్ ఓంకార్. ఇక ఈ సినిమాకి స్టార్ ఫ్లేవర్ యాడ్ అయ్యింది. అందుకని కథ విషయంలో మరి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాడట. అలాగే మొదటి పార్ట్‌తో పోలిస్తే ఈ పార్ట్‌లో ట్విస్ట్‌లు ఎక్కువగా ఉండనున్నాయట. నాగార్జున క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు నాగార్జున ఈ సినిమాలో. నాగార్జున ఇంతవరకూ నటించని పాత్ర ఇది. ఇటీవలే 'నమో వేంకటేశాయ' సినిమాతో 'హథీరామ్ బాబా' పాత్రలో నటించి, మెప్పించిన నాగ్ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.