నాగ్‌ - రకుల్‌ ఫెంటాస్టిక్‌ కెమిస్ట్రీ!

మరిన్ని వార్తలు

'మన్మధుడు 2' కోసం సీనియర్‌ హీరో నాగ్‌తో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జోడీ కడుతోన్న సంగతి తెలిసిందే. ఆన్‌ స్క్రీన్‌ రకుల్‌ - నాగ్‌ కెమిస్ట్రీ సూపర్బ్‌గా సెట్‌ అయ్యిందట. లేటు వయసులోనూ నాగ్‌ మన్మధుడిలా యంగ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లో మెరిసిపోతున్నాడు. నాగ్‌ పక్కన యంగ్‌ అయినా రకుల్‌ సరిజోడీలా ఒదిగిపోయింది. లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌లో నాగార్జున సినిమాలోని లేడీ టీమ్‌తో సరదాగా దిగిన స్టిల్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

ఇక ఇదే స్టిల్స్‌లో నాగ్‌ పక్కన రకుల్‌ చాలా ఫ్రీగా మూవ్‌ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయినా నాగార్జునలో ఉన్న స్పెషాలిటీ అదే. ఏ హీరోయిన్స్‌తోనైనా నాగ్‌ అంతే ఫ్రెండ్లీగా కలిసిసోతుంటాడు. ఇక రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా అంతే. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. టాలీవుడ్‌ని వదిలి, బాలీవుడ్‌కెళ్లాక మళ్లీ నాగార్జున పుణ్యమా అని టాలీవుడ్‌కి హీరోయిన్‌గా తిరిగొచ్చే ఛాన్స్‌ దక్కించుకుంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

 

అందుకే నాగార్జునపై ఎనలేని అభిమానాన్ని కురిపిస్తోంది. ఇక 'మన్మధుడు 2' సినిమా విషయానికి వస్తే, యంగ్‌స్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకి దర్శకుడు. ఫుల్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు రాహుల్‌ రవీంద్రన్‌. నాగార్జున స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అన్నట్లు ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. సమంతతో కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోలు కూడా లేటెస్ట్‌గా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS