స‌మంత ట్వీట్‌.. లైట్ తీసుకున్న నాగ్!

మరిన్ని వార్తలు

నాగ చైత‌న్య - స‌మంత‌ల మ‌ధ్య ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ప్ర‌స్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స‌మంత‌ ట్విట్ట‌ర్ లో త‌న పేరు ముందు అక్కినేని తొల‌గించి కేవ‌లం `ఎస్` అనే అక్ష‌రం మాత్ర‌మే ఉంచుకోవ‌డం తో.. పుకార్లు మొద‌ల‌య్యాయి. స‌మంత - చైతూ మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని, ఇద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చేశాయ్‌. అయితే దీనిపై అటు స‌మంత గానీ, ఇటు చైతూ గానీ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఇదే ప్ర‌శ్న స‌మంత‌కు ఎదురైతే.. అడ్డ‌దిడ్డంగా స‌మాధానం చెప్పింది. దాంతో ఈ పుకార్ల‌కు బ‌లం వ‌చ్చిన‌ట్టైంది.

 

అయితే తాజాగా నాగార్జున పుట్టిన రోజున‌... స‌మంత ట్వీట్ చేసింది. నాగ్ మామా అంటూ శుభాకాంక్ష‌లు అందజేసింది. ఇదంతా పుకార్ల‌కు చెక్ పెట్టే వ్య‌వ‌హారం అనుకున్నారంతా. ఈ ట్వీట్ పై నాగార్జున ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం ఇప్పుడు మ‌రోసారి కొత్త ప్ర‌శ్న‌ల్ని లేవ‌నెత్తుతోంది. నాగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చాలామంది సెల‌బ్రెటీలు ట్వీట్లు చేశారు. వాటిని నాగార్జున కూడా స‌మాధానం ఇచ్చేశాడు. కానీ స‌మంత ట్వీట్ ని మాత్రం ప‌ట్టించుకోలేదు. దాంతో మ‌రోసారి గాసిప్ రాయుళ్ల‌కు కావ‌ల్సినంత ప‌ని దొరికిన‌ట్టైంది. మొత్తానికి ఏదో జ‌రుగుతోంద‌న్న సంకేతాలు మాత్రం అందుతున్నాయి. అదేమిటి? అనే విష‌యంలోనే క్లారిటీ లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS