బిగ్ బాస్ 4 సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆగస్టులో మా టీవీలో ఈ రియాలిటీ షో టెలీకాస్ట్ కానుంది. ఇప్పటికే.. సెలబ్రెటీల లిస్టు ఫైనల్ అయిపోయింది. వాళ్ల పేర్లు కొన్ని బయటకు వచ్చినా - అధికారికంగా ధృవీకరించాల్సివుంది. అయితే ఇప్పుడు నాగార్జున పారితోషికంపై చర్చ మొదలైంది. ఈ షో కోసం నాగ్ ఎంత తీసుకుంటున్నాడు? అనే విషయంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ 3కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ సీజన్ కోసం ఎపిసోడ్ కి 12 లక్షలు తీసుకున్నాడు నాగార్జున. ఈసారి నాగ్ పారితోషికం 20 లక్షలని టాక్. అంటే ఎనిమిది లక్షలు పెరిగినట్టు. గతంలో ఒక్కో సీజన్ దాదాపు 100 రోజుల పాటు సాగింది. ఈసారి మాత్రం 50 రోజులకే పరిమితం చేసే ఛాన్సుంది. సగం రోజులే షో నడిచినా - పూర్తి స్థాయిలో పారితోషికాన్ని లాగేస్తున్నాడన్నమాట. ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ షో సాగినా.. వారానికి నాగ్ రెండు ఎపిసోడ్లలో కనిపిస్తాడు. అంటే.. ఈ సీజన్‌తో నాగార్జున దాదాపు 4 కోట్ల వరకూ సంపాదించొచ్చు.