చిత్రసీమ అంటేనే హీరోల డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్లదే క్రేజ్ అంతా. ఓ సినిమా హిట్టయితే క్రెడిట్ కూడా వాళ్లకే చేరిపోతుంది. పారితోషికాలు, ఇతర సౌకర్యాలు కూడా వాళ్లకే ఎక్కువ. మిగిలిన ఎవరికైనా సరే, ఆ తరవాతి స్థానమే. టాప్ హీరోయిన్లంతా ఈ విషయంలోనే తెగ ఫీలైపోతుంటారు. `హీరోలకు ఉన్నదేమిటి? మాకు లేనిదేమిటి?` అంటూ లాజిక్కులు తీస్తుంటారు.
సమంత కూడా ఈ డామినేషన్ ని ప్రశ్నిస్తోంది. ``ఓ హీరోయిన్‌కి వరుసగా రెండు మూడు ఫ్లాపులు వస్తే చాలు. కెరీర్ అయిపోయినట్టే అనుకుంటారు. పారితోషికం కూడా తగ్గించేస్తారు. కానీ హీరోలకు అలా కాదు. వరుసగా నాలుగైదు ఫ్లాపులు ఇచ్చినా, ఒక్క హిట్టుతో మళ్లీ రేసులోకి వస్తారు. పారితోషికాలు కూడా సినిమా సినిమాకి సంబంధం లేకుండా తీసుకుంటారు. మాకూ, హీరోలకూ మధ్య ఉన్న తేడా అదే`` అంటోంది సమంత. ఇదంతా స్టార్ హీరోలపై అక్కసుతోనే మాట్లాడుతోందని.. కొంతమంది హీరోల అభిమానులు వాదిస్తున్నారు. కాకపోతే.. సమంత చెప్పిన పాయింట్ లోనూ నిజం ఉంది మరి.