పవర్‌ఫుల్‌ 'డాన్‌' బట్‌ వెరీ రొమాంటిక్‌.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున సినిమా అంటే రొమాంటిక్‌ యాంగిల్‌ లేకుండానా..? నో వే. 'ఆఫీసర్‌' అంటూ యాక్షన్‌ సీరియస్‌ మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. 

తాజాగా 'దేవదాస్‌' సినిమాతో రానున్నాడు. నాగ్‌ - నాని మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునది పవర్‌ఫుల్‌ మాఫియా డాన్‌ పాత్ర అన్న సంగతి రివీల్‌ అయిపోయిందెలాగూ. అయితే పవర్‌ఫుల్‌ డాన్‌ కదా. మన్మధుడిలో రొమాంటిక్‌ యాంగిల్‌ ఉండతనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లేనండోయ్‌. మాఫియా డాన్‌ అయినా ఫుల్‌ రొమాంటిక్‌ అట. మరి మన మన్మధుడితో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఆకాంక్ష సింగ్‌. 

అక్కినేని మేనల్లుడు సుమంత్‌ నటించిన 'మళ్లీరావా' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీనే ఈ ఆకాంక్ష సింగ్‌. 'మళ్లీ రావా' చిత్రంలో అమ్మడి టాలెంట్‌ చూసి తన సినిమాలో ఛాన్స్‌ ఇచ్చేశాడు నాగ్‌. ఇంకేముంది అమ్మడికి పండగే పండగ. రెండో సినిమాకే స్టార్‌ హీరోయిన్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ దక్కించుకుందీ బ్యూటీ. సినిమాలో నాగార్జున పాత్రలో రెండు వేరియేషన్స్‌ ఉంటాయట. రొమాంటిక్‌ యాంగిల్‌తో పాటు పవర్‌ఫుల్‌ యాంగిల్‌ అన్న మాట. 

ఇకపోతే మరో హీరో నాని విషయానికి వస్తే, నాని డాక్టర్‌ పాత్రలో నటిస్తున్నాడు. మన డాక్టర్‌గారితో జోడీ కట్టే ఆ ముద్దుగుమ్మ ఎవరనే కదా మీ డౌట్‌. రష్మికా మండన్నా. అదేనండీ 'ఛలో' బ్యూటీ. సెప్టెంబర్‌లో 'దేవదాస్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS