బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ గా హీరోయిన్?

By iQlikMovies - July 12, 2018 - 18:08 PM IST

మరిన్ని వార్తలు

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో రోజుకొక కొత్త పరిణామం చోటు చేసుకుంటున్నది. ముఖ్యంగా ఇప్పటివరకు ఎంతో కలిసి మెలిసి ఉన్న వాళ్ళు మరో రోజు బద్ద శత్రువులుగా మారిపోతున్నారు.

ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక కొత్త పార్టిసిపెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తున్నది. అయితే గత నాలుగు వారాల నుండి ఇంటిలోని వాళ్ళు ఒకరితో ఒకరు బాగా కలిసిపోయిన ఈ తరుణంలో మరో కొత్త పార్టిసిపెంట్ తో వీళ్ళు ఎలా కలుస్తారు అదే సమయంలో ఇంటిలోకి ప్రవేశించే వారు ఎలా వీళ్ళందరితో మెలుగుతారు అని అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఇక ఇవన్ని పక్కన పెడితే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించబోయేది నటి హెబ్బ పటేల్ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలే కావడంతో వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు అని ఒక పక్కన అనుకున్నా ఈ పుకార్లని హెబ్బ పటేల్ త్రోసిపుచ్చని కారణంగా ఇది నిజమేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఇంకొక రెండు రోజులు ఆగితే ఈ వైల్డ్ కార్డ్ పైన అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS