ప‌వ‌న్‌, మ‌హేష్‌ల‌ను త‌ట్టుకోగ‌ల‌డా?

మరిన్ని వార్తలు

2022 సంక్రాంతి... ఓ రేంజ్ లో ఉండ‌బోతోంది. సంక్రాంతి పండ‌క్కి పెద్ద సినిమాలు రావ‌డం స‌హ‌జ‌మే. కానీ.. ఆ సీజ‌న్‌లో రాబోతున్న సినిమాలేంట‌న్న‌ది... రెండు మూడు నెల‌ల ముందే ఖ‌రార‌వుతాయి. అయితే.. ప‌ది నెల‌ల ముందే.. రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బ‌రి ఉంటామ‌ని ప్ర‌క‌టించేశాయి. మ‌హేష్ బాబు `స‌ర్కారు వారి పాట‌` సంక్రాంతికి వ‌స్తోంది. ప‌వ‌న్ -క్రిష్ కాంబోలో వ‌స్తున్న సినిమా కూడా సంక్రాంతికే రెడీ చేయ‌బోతున్నారు. అటు మ‌హేష్‌, ఇటు ప‌వ‌న్‌... ఇద్దరూ టాప్ స్టార్లే. కాబ‌ట్టి, ఈ సంక్రాంతి పోటీ గ‌ట్టిగా ఉండ‌బోతోంద‌ని అర్థ‌మైంది.

 

అయితే ఇప్పుడు నాగార్జున కూడా సంక్రాంతికి సై అంటున్నాడు. నాగ్ సినిమా `బంగార్రాజు` వ‌చ్చే సంక్రాంతికి రాబోతోంద‌ట‌. నాగార్జున `సోగ్గాడే చిన్ని నాయిన‌` కి ప్రీక్వెల్ ఇది. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. `బంగార్రాజు`లో నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు చైతూ ప్లేసులో మ‌రో హీరోని ఎంపిక చేసుకునే ప‌నిలో ప‌డింది చిత్ర‌బృందం.

 

ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది తేలాక‌.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంది. `సోగ్గాడే..` కూడా సంక్రాంతికే విడుద‌లైంది. సూప‌ర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు మ‌హేష్, ప‌వ‌న్‌ల‌ను నాగ్ త‌ట్టుకోగ‌ల‌డా? అనేది మిలియ‌న్ డాలర్ల ప్ర‌శ్న‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS