టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎంతో ఇష్టపడి రూపొందిస్తున్నారు నాగార్జున. 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాతో నాగార్జునకి మంచి హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణపై నమ్మకంతో ఈ సినిమాని ఆయన రూపొందిస్తున్నారు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు ఈ సినిమాలో. ప్రస్తుతం ఆయన 'రాజుగారి గది - 2' చిత్రంలో నటిస్తున్నారు. 'సోగ్గాడే చిన్న నాయనా' సినిమాతో ఆయన 50 కోట్లు క్లబ్‌లో చేరిపోయారు. మరి 100 కోట్ల సంగతేంటి అని అడిగితే, ఈ ప్రస్థావనకు నాగ్ ఘాటుగా స్పందించారు. వసూళ్ల లెక్కలు నా దగ్గర ప్రస్థావించకండి. 100 కోట్లు కాదు, ఇప్పుడు మనం 1500 కోట్ల క్లబ్‌లో ఉన్నాం ఆ సంగతి మీరు మర్చిపోయారు కాబోలు. 'బాహుబలి ది కన్‌క్లూజన్' సినిమా తెచ్చి పెట్టిన వసూళ్ల లెక్కలివి అని ఆయన నిర్మొహమాటంగా తెలిపారు. అయినా మన తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో ఎదిగింది. ఈ తరుణంలో 50 కోట్లు, 100 కోట్లు మార్కెట్ గురించి మాట్లాడుకోకూడదు అన్నారు. మన తెలుగు సినిమా మార్కెట్‌ని మెరింత పెంచుకుందాం. మరిన్ని మంచి సినిమాలు తీద్దాం. అంతే కానీ ఓ సినిమాతో మరో సినిమాని పోల్చుకోవద్దు అని నాగ్ తెలిపారు. అవును ఓ సీనియర్ హీరో ముందు వసూళ్ల సంగతి ఎత్తితే అంతే మరి.అందుకే ఈ విషయంలో నాగార్జునకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాం.