నాగచైతన్య - సమంతల పెళ్లి విషయంలో నాగార్జున కేవలం అతిథి పాత్ర పోషిస్తున్నాడా? ఈ పెళ్లి వ్యవహారాలతో నాగ్‌కి ఎలాంటి సంబంధం లేదా? నాగ్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. `చైతూకి జనవరిలో నిశ్చితార్థం జరుగుతుందని మేం కూడా అనుకోలేదు. ఓ రోజు సడన్ గా నా దగ్గరకు వచ్చాడు. జనవరి 29న నిశ్చితార్థం చేసుకొంటున్నాం అన్నాడు. ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పా` అని ఓ ఇంటర్వ్యూలో నాగ్ మనసు విప్పాడు. అంటే నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలో కూడా నాగచైతన్య, సమంతలే నిర్ణయించుకొన్నారన్నమాట. ఇప్పుడు పెళ్లి కి కూడా అదే ఫార్ములా. చైతూ ఎప్పుడు పెళ్లి చేయమంటే అప్పుడే పెళ్లి చేస్తానని నాగ్ క్లారిటీగా చెబుతున్నాడు. అంటే.. అంతా పిల్లల ఇష్టాయిష్టాలకే వదిలేశారన్నమాట. అఖిల్ విషయంలోనూ ఇదే జరుగుతోందట. నిశ్చితార్థం, పెళ్లి డేటు విషయంలో నాగ్ ప్రమేయం ఏమీ లేదట. అంతా అఖిల్, శ్రియా రెడ్డి ఇష్టప్రకారమే జరుగుతోందట. అఖిల్ పెళ్లి ఇటలీలో ఫిక్స్ అయ్యింది. ఇది కూడా అఖిల్ నిర్ణయించిన వెన్యూనే అని తెలిసింది. అక్కినేని వారసుల పెళ్లికి వెళ్లే అతిథుల్లానే నాగ్, అమల పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి వస్తారన్నమాట.