వెంకటేష్ మరో భారీ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధం చేయబోతున్నారు. టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాలకు వెంకీ ముందు వరుసలో ఉంటారు. యంగ్ హీరోస్‌తోనైనా, స్టార్ హీరోస్‌తోనైనా నటించడానికి ముందుకొచ్చే స్టార్ హీరో వెంకీ అని వేరే చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్‌తో 'గోపాల గోపాల' చిత్రంలో నటించాడు వెంకీ. ఈ సినిమా సూపర్ విజయం అందుకుంది. అలాగే మహేష్‌బాబుతో కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఓ సెన్సేషనల్ హిట్‌ని సొంతం చేసుకుంది. నేచురల్ యాక్టింగ్‌తో ప్యామిలీ ఆడియన్స్‌లో ఫుల్ పాలోయింగ్ ఉంది వెంకీకి. తాజాగా వెంకీ, నాగార్జునతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ బిగ్ ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలో ఉందట. నాగార్జున నటించిన 'నమో వేంకటేశాయ' ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే వెంకీ నటిస్తోన్న 'గురు' కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ 'సాలా ఖదూస్'కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఇటీవలే 'బాబు బంగారం' సినిమాతో హిట్‌ని సొంతం చేసుకున్న వెంకీ, 'గురు'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోనున్నాడు. అంతేకాదు రీమేక్‌లు వెంకీకి బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని భావిస్తోంది చిత్ర యూనిట్. మొత్తానికి ఈ సినిమా తర్వాత వెంకీ, నాగ్ మల్టీ స్టారర్ విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.