పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా అమెరికా చేరుకున్నాడు.
హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ పేరిట జరగబోతున్న రెండు రోజుల కార్యక్రమానికి హాజరుకావడానికి పవన్ అమెరికా వెళ్ళాడు. తను 5రోజుల పాటు ఇక్కడ ఉండబోతున్నట్టు సమాచారం.
అయితే ఈసారి ట్రిప్ లో తనతో పాటు తన భార్య అన్నా లెజ్నావా ని కూడా తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు ఎప్పుడూ పవన్ తన భార్యతో కలిసి కనిపించింది లేదు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ జంటగా కనిపించిన పిక్స్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.