గత వారం బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసింది సమంత. నాగార్జున షూటింగ్ నిమిత్తం.. కులూమనాలీ వెళ్లిపోవడంతో, అక్కడి నుంచి తిరిగి రావడం ఇబ్బంది అవ్వడంతో, నాగార్జున స్థానంలో సమంత మెరిసింది. ఏమాటకామాట చెప్పుకోవాలి. నాగ్ లేని లోటుని సమంత భర్తీ చేయగలిగింది. ఈ షోకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలిగింది. సమంత మరికొన్ని ఎపిసోడ్లు కనిపిస్తే బాగుంటుందనుకున్నారంతా.
బిగ్ బాస్‌కి ఈ వారం వచ్చిన రేటింగులు చూసి, సమంతని కొనసాగించడం ఖాయం అనుకున్నారు. అయితే... ఇప్పుడు నాగ్ తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ వీకెండ్ బిగ్ బాస్ 4 హౌస్ ని నడిపించేది నాగార్జునేనట. కులూమనాలి నుంచి నాగ్ వస్తున్నారని, ఈ వారం ఆయన బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. నాగ్ వస్తే ఇక సమంత కనిపించదు. సమంత ఆపధర్మ హోస్ట్ అవతారం ఎత్తిందని, ఆమెను కొనసాగించడం అసాధ్యమని తేలిపోయింది. మళ్లీ ఎప్పుడైనా నాగ్ కి కుదరని పక్షంలో.. సమంత వస్తుందట. అంత వరకూ సమంత కనిపించదన్నమాట.