నగ్నం మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: స్వీటీ
దర్శకత్వం :  రామ్ గోపాల్ వర్మ
డిస్ట్రిబ్యూషన్ : శ్రేయాస్ ఈటీ

 

వ‌ర్మ తెలివితేట‌ల‌కు జోహార్లు చెప్పాల్సిందే. త‌న‌లో ద‌ర్శ‌కుడి కంటే... ఓ నిర్మాత బాగా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంటుంది. థియేట‌ర్లు లేక‌, అవి ఎప్పుడు తెరుస్తారో తెలీక‌... బ‌డా బ‌డా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటుంటే... ఆర్జీవీ ద‌ర్జాగా త‌న సినిమాల్ని ఆన్ లైన్‌లో విడుద‌ల చేసుకుంటూ గ‌ట్టిగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఆమ‌ధ్య విడుద‌లైన `క్లైమాక్స్‌` కి నెగిటీవ్ టాక్ వ‌చ్చినా - ఆర్థికంగా బాగానే సొమ్ము చేసుకుంది. ఇప్పుడు `న‌గ్నం`ని వ‌దిలాడు. షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా ఇది. దీన్ని చూడాలంటే 200 చెల్లించాలి. అంటే.. టికెట్ కంటే ఎక్కువ ధ‌ర అన్న‌మాట‌. ఆర్టీవీ గేమ్ ప్లాన్ కి ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ ఏం కావాలి..? మ‌రి ఈ షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా ఎలా వుంది?  దీని క‌థేంటి?

 

* క‌థ‌

 

`న‌గ్నం`లో క‌థేమిటో వెదుక్కోకూడ‌దు. అది కొన్ని స‌న్నివేశాల స‌మాహారం అంతే. చెప్పాం క‌దా, ఇది షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా అని. ఓ పెద్ద బంగ్లా. అందులో ఓ జంట‌. ఆ భర్త‌కు భార్య‌తో గ‌డిపే స‌మ‌యమే ఉండ‌దు. అలాంటి చోట ఓ కుర్రాడు ప‌ని మ‌నిషిగా చేర‌తాడు. ఓసారి స‌డ‌న్‌గా య‌జ‌మానురాల్ని న‌గ్నంగా చూసి.. చ‌లించిపోతాడు. అప్ప‌టి నుంచీ వాతావ‌ర‌ణం వేడెక్కుతుంది. ఆ వేడిలో య‌జ‌మానురాలు - ప‌ని మ‌నిషి కుర్రాడు ఏం చేశారు?   ఆ త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాలేంటి?  అనేదే `న‌గ్నం`.

 

* విశ్లేష‌ణ‌

 

బీ, సీ గ్రేడ్ సినిమాలెప్పుడూ బూతు చుట్టూ తిరుగుతుంటాయి. చివ‌ర్లో ఓ నీతి ని బిస్కెట్ గా పారేస్తుంటారు. ఆ టెక్నిక్‌తోనే వ‌ర్మ తీసిన సినిమా ఇది. 20 నిమిషాలు ర‌క‌ర‌కాల యాంగిల్స్ లో అందాల్ని ఆర‌బోస్తూ.. యువ‌త బ‌ల‌హీన‌త‌ల్ని క్యాష్ చేసుకునే ఫ్రేమింగ్స్ అన్నీ వ‌రుస క‌ట్టించాడు. ప్ర‌ధాన పాత్ర‌ధారిణి స్వీటీ ని ర‌క‌ర‌కాల పోజుల్లో చూపించి, వేడి పుట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌రి రెండు నిమిషాలూ ఓ నీతి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అంత‌కు మించి ఏం లేదు. ట్రైల‌ర్‌, టీజ‌ర్‌ల‌లో ఏముందో.. సినిమా మొత్తం అదే క‌నిపిస్తుంది. అంత‌కు మించి ఒక్క ఫ్రేము కూడా ముందుకు క‌ద‌ల‌దు. క‌థ‌, క‌థ‌నం, స్క్రిప్టు.. ఇవ‌న్నీ లేకుండా ఓ కెమెరా, ముగ్గురు న‌టుల్నీ ఓ ఇంట్లో ఇరికించి 22 నిమిషాల పాటు కెమెరాని ఆన్ చేసి పెట్టిన‌ట్టు అనిపిస్తుందంతే. వ‌ర్మ నుంచి ఈ రోజుల్లో ఇంత‌కంటే ఏం ఆశించ‌లేమేమో.

 

నిజానికి ప్ర‌పంచ షార్ట్ ఫిల్మ్స్ చ‌రిత్ర‌లో చాలా షార్ట్ ఫిల్మ్స్ వ‌చ్చాయి. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ ని 200 పెట్టి, చూసేలా చేయ‌డం వ‌ర్మ‌కే చెల్లింది. నిజానికి వ‌ర్మ పేరు, త‌న క్రేజ్.. ఇప్ప‌టికీ ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త వ‌ర్మ‌దే. త‌న షార్ట్ ఫిల్మ్ ని 200 పెట్టి చూడ్డానికి సైతం జ‌నం సిద్ధ ప‌డుతున్నారంటే, క‌థ‌, క‌థ‌నాల విష‌యాల్లో తానెంత ప‌క‌డ్బందీగా ఉండాలి?  వ‌ర్మ ది కేవ‌లం క్యాష్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న అంతే. ఆ విష‌యంలో విజ‌యం సాధించాడు. ఇలాంటి వేదిక‌ల‌పై మంచి మంచి ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలూ చేస్తే, ఆర్థికంగానూ లాభ‌సాటిగా ఉంటుంది. కొత్త ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు ఓ గొప్ప వేదిక దొరికిన‌ట్టవుతుంది. కానీ ఇలాంటి బూతు సినిమాలు వ‌స్తుంటే మాత్రం.. ఓటీటీపై గౌర‌వం కూడా పోతుంది.

 

* న‌టీన‌టులు సాంకేతిక‌త‌

 

వ‌ర్మ‌లో గొప్ప‌ద‌నం ఏమిటంటే.. ఎలాంటి ఆర్టిస్టుల్ని తీసుకొచ్చినా, త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు మ‌ల‌చుకోగ‌ల‌డు. స్వీటీ.. ఏమాత్రం మొహ‌మాట‌ప‌డ‌కుండా అందాల్ని ఆర‌బోసింది. మిగిలిన ఇద్ద‌రూ ఫ‌ర్వాలేదు. కెమెరా యాంగిల్స్ వ‌ర్మ టేస్ట్ కి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం ఓకే అనిపిస్తుంది.

 

* ప్లస్ పాయింట్స్‌

నిడివి

 

* మైన‌స్ పాయింట్స్‌

టికెట్ రేటు
బీ గ్రేడ్ స‌న్నివేశాలు
సీ గ్రేడ్ ఆలోచ‌న‌లు

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:   న‌గ్న‌త్వ‌మే ప్ర‌ధాన‌ము


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS