'నక్షత్రం'లో నక్షత్రాలెన్నో!

మరిన్ని వార్తలు

కృష్ణవంశీ సినిమా 'నక్షత్రం' విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలింతమంది ఆర్టిస్టులను కృష్ణవంశీ ఎలా డీల్‌ చేశాడా? సినిమాలో అనిపిస్తోంది ట్రైలర్‌ చూస్తుంటే. అయినా ఇది కృష్ణవంశీకి అలవాటే. స్క్రీన్‌ నిండా ఆర్టిస్టులతో నింపేస్తూ ఉంటాడు తన సినిమాల్లో. అయితే ఈ సినిమాలో అలా కాదు, ఒకింత స్పెషల్‌గానే అనిపిస్తోంది. ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టరే పవర్‌ ఫుల్‌గా అనిపిస్తోంది. డైలాగ్స్‌ దద్దరిల్లిపోతున్నాయి. పోలీస్‌ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రమిది. హీరో పోలీస్‌ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. చిన్నప్పట్నుంచీ అదే దృక్పథంతో పెరుగుతాడు. సందీప్‌ కిషన్‌ ఈ సినిమాలో హీరో కాగా, అందాల రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. నవ్వుల రారాజు, మెగా మేనల్లుడు ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్రలో సీరియస్‌ క్యారెక్టర్‌ కనిపిస్తున్నాడు. 'అలెగ్జాండర్‌ ఎక్కడ? అనే డైలాగ్‌ బాగా వినిపిస్తోంది. ఆ అలెగ్జాండర్‌ క్యారెక్టర్‌నే సాయి ధరమ్‌ తేజ్‌ పోషిస్తున్నాడు. ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె కూడా పవర్‌ ఫుల్‌ పోలీసాఫసరే. ఫైట్లు ఇరగదీసేస్తోంది. ఇక ప్రకాష్‌రాజ్‌, శివాజీరాజా తదితరులు కూడా ఇంపార్టెంట్‌ రోల్స్‌నే పోషించినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. యంగ్‌ హీరో తనీష్‌ ఈ సినిమాలో విలన్‌ పాత్రలో కనిపిస్తాడు. మొత్తానికి కృష్ణవంశీ ట్రైలర్‌తోనే సినిమా చూపించేసిన ఫీలింగ్‌ కల్గించేశాడు. ఎంతో ఆశక్తికరంగా ఉంది ట్రైలర్‌ చూడ్డానికి. దటీజ్‌ కృష్ణవంశీ. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS