బరువు బాధ్యతలు తగ్గించుకుంటోన్న నమిత?

మరిన్ని వార్తలు

ఛబ్బీ ఛీక్స్‌, డింపుల్‌ చిన్‌.. రోజీ లిప్స్‌ క్యూట్‌ అండ్‌ హాటీ.. అనేలా ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తర్వాత భారీ కాయంగా మారి, తెలుగు తమ్ముళ్లను ఇంప్రెస్‌ చేయలేకపోయింది. భారీ అందాలకు ఎల్లప్పుడూ దాసోహం అనే తమిళ తంబీలను మాత్రం బాగా ఇంప్రెస్‌ చేసేసి, అక్కడే తిష్ట వేసింది. ఆమె భారీకాయానికి అక్కడ స్టార్‌డమ్‌ కట్టబెట్టేశారు. అలా అలా నడిచిపోతున్న నమిత కెరీర్‌కి మధ్యలో కాస్త బ్రేక్‌ పడింది. దాంతో, పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేయసాగింది. నటనను ఓ సారి ఇంజెక్ట్‌ చేసుకున్నాక, అంత త్వరగా వదిలేయడం సాధ్యం కాదు కదా.

 

అలా మళ్లీ నమిత దృష్టి నటన వైపు మళ్లింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేయాలనుకుంది. ఆ దిశగా కొన్ని అవకాశాలు కూడా ఆమె తలుపు తట్టడంతో, ఇంకేముంది రంగం సిద్ధం చేసేసుకుంది. అయితే, ఎబ్బెట్టుగా మారిన తన శరీర బరువును ఎలాగైనా తగ్గించుకోవాలనుకుందట. పట్టు పట్టి, కసరత్తులు మొదలెట్టింది. దాంతో పూర్తిగా కాకున్నా, ఎంతో కొంత ఆ బరువు బాధ్యతలు తగ్గించుకుంటోందట. ఈ పట్టు ఇలాగే కొనసాగితే, నమిత జీరోసైజ్‌కి చేరుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదంటున్నారు. సో త్వరలోనే స్లిమ్‌ అండ్‌ స్లీకీ నమితను చూడబోతున్నామన్న మాట. ఇదిలా ఉంటే, ఆల్రెడీ నమిత కొన్ని ప్రాజెక్టులపై సైన్‌ చేసిందనీ సమాచారం. వీటిలో కొన్ని నెగిటివ్‌ షేడ్‌ క్యారెక్టర్స్‌ ఉన్నాయంటూ టాక్‌ వినిపిస్తోంది. చూడాలి మరి, హాట్‌ బ్యూటీగా పేరున్న నమిత, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి రోల్స్‌తో సందడి చేయనుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS