'సొంతం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ముద్దుగా పలకరించింది బ్యూటీ నమిత. వస్తూ వస్తూనే తెలుగు ఆడియన్స్‌ని క్యూట్‌గా ఎట్రాక్ట్ చేసింది. తర్వాత తెలుగులో చాలానే సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. 'సింహా'లో బాలయ్య పక్కన ఐటెం సాంగ్‌లో కూడా మెరిసింది.
తర్వాత బొద్దుగా మారిపోవడంతో తెలుగు ఆడియన్స్ నమితని ఏక్సెప్ట్ చేయలేకపోయారు. దాంతో తమిళనాడుకు చెక్కేసింది. అక్కడ ఈ బొద్దు సుందరి అందాలు తమిళ తంబీలకు తెగ నచ్చేశాయి. వరుస అవకాశాలతో అక్కడ బిజీ అయిపోయింది. ఆ తర్వాత ఇక తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ ప్రబాస్ హీరోగా నటించిన 'బిల్లా'లో ఓ క్యారెక్టర్ చేసింది. అలా అడపా దడపా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది తప్ప, కోలీవుడ్‌లోనే ఫిక్స్ అయిపోయింది.
ఈ మధ్య నమిత, సీనియర్ నటుడు శరత్ బాబుని పెళ్లి చేసుకోబోతోందంటూ రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్‌కి అంతా షాక్ అయ్యారు. అయితే నమిత స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చేదాకా ఆ రూమర్స్ ఆగలేదు. ఆ రూమర్ సద్దుమణిగిందనుకుంటే, ఇదిగో ఇప్పుడు నమితే స్వయంగా ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది. నమిత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఆ వీడియో ద్వారానే తన భాగస్వామితో కలిసి తన పెళ్లి విషయం చెప్పింది.
తమిళ నటుడు వీరేంద్ర చౌదరిని నమిత ఈ నెల 24న వివాహం చేసుకోబోతోంది. ఈ న్యూస్ విని మొదట వీరూనే షాక్ అయ్యాడట. వీరిద్దరికీ మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ఇప్పుడు పెళ్లిగా మారబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని వీరూ చెప్పాడు. వీరూని పెళ్లాడబోతున్నందుకు నమిత చాలా సంతోషంగా ఉన్నానంటోంది. నమితా, వీరూ కలిసి గతంలో 'మియా' అనే ఓ థ్రిల్లర్ మూవీలో నటించారు.