మహేష్‌బాబు కెరీర్ విషయంలో నమ్రత చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటుంది. మహేష్ సినిమా ఎంపిక, హీరోయిన్లు, కాల్షీట్లు, రెమ్యునరేషన్... ఇలాంటి విషయాల్ని నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. కానీ... ఈ విషయల్ని నమ్రత ఒప్పుకోవడం లేదు. మహేష్ సినిమాల విషయంలో తన జోక్యం ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పేసింది. ఆవిషయాల్లో తాను ఏమాత్రం కలగ జేసుకోను అంటోంది. ఇటీవల ఇన్‌స్ట్రాలో అభిమానులతో మాట్లాడింది నమ్రత. ఈ సందర్భంగా మహేష్ సినిమాల ఎంపికలో మీ జోక్యం ఎంత వరకూ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ పై విధంగా స్పందించింది.
అయితే.. నమ్రత గురించీ, మహేష్ గురించీ తెలిసినవాళ్లంతా.. `నమ్రత జోక్యం తప్పకుండా ఉంటుంది` అంటున్నారు. మహేష్ షూటింగులకు ఎప్పుడు రావాలి? షూటింగుల లొకేషన్లేంటి? కాస్ట్యూమ్స్ ఎలాంటి వేసుకోవాలి? అనే విషయాల్లో నమ్రత జోక్యం విపరీతంగా ఉంటుందని, అసలు మహేష్ అప్పాయింట్ కావాలంటే నమ్రతని ప్రసన్నం చేసుకోవాల్సిందే అని చెబుతున్నారు. కానీ నమ్రత మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వీటిలో ఏది నిజమో... నమ్రతకే తెలియాలి.