అల్లరి నరేష్ కొత్త సినిమా నాంది ప్రచార చిత్రం ఆకట్టుకుంది. నరేష్‌ని ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతున్నామన్న భరోసాని అందించింది. దర్శకుడు ఏదో ఓ బలమైన పాయింట్ ఎంచుకున్నాడన్న నమ్మకం కలిగింది. మొత్తానికి నాంది సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది. అయితే.. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు తప్పిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఇప్పటికి దాదాపుగా 8 కోట్లకుపైగానే అయిపోయందట. మరో 20 శాతం చిత్రీకరణ బాకీ. ఆ తరవాత ప్రమోషన్లకు బాగా ఖర్చు పెట్టాలి. ఎలా చూసుకున్నా రూ.10 కోట్లకు పైమాటే. నరేష్ సినిమాకి ఈ పది కోట్లు రాబట్టుకునే సత్తా ఉందా? అనేదే పెద్ద ప్రశ్న. సుడిగాడు తరవాత నరేష్ బాగా వెనకబడిపోయాడు. హిట్లు లేవు. దాంతో మార్కెట్ బాగా పడిపోయింది. పైగా నాంది టీజర్ చూస్తుంటే ఇదో ప్రయోగాత్మక చిత్రం అనిపిస్తుంది. ఇలాంటి సీరియస్ సినిమాలకు మెచ్చుకోళ్లు వస్తాయి కానీ, వసూళ్లు కష్టమే. అయితే కథపై నమ్మకంతో నిర్మాతలు నరేష్ మార్కెట్ ని మించి ఖర్చు పెట్టారట. ఆ నమ్మకం నిజమవ్వాలని మనమూ కోరుకుందాం.