'తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. పదేళ్ల క్రితమే నేనీ మాట చెప్పాను. దాని గురించి మాట్లాడేందుకు ఇంకేమీ లేదు. అబద్ధమంటే అబద్ధమే. ఇక ఈ విషయంలో ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు.. అని నానా పటేకర్ చెప్పారు. 'హౌస్‌ఫుల్ 4' సినిమా షూటింగ్ నిమిత్తం జోధ్‌పూర్ వెళ్లిన నానా పటేకర్ ముంబయ్‌కి తిరిగి వచ్చారు. ముంబయ్‌లో అడుగు పెట్టగానే మీడియా ఆయన వెంట పడింది.
నానా పటేకర్ తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పై విధంగా మీడియాకి సమాధానమిచ్చారు. పదేళ్ల క్రితం జరిగిన ఇష్యూ ఇది. ఓ సినిమా షూటింగ్‌లో తనను లైంగికంగా వేధించాడనీ, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనీ నానాపటేకర్‌పై హీరోయిన్ తనూశ్రీదత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అది అబద్ధమని ఎంత చెప్పినా తనూశ్రీ దత్తా ఆపడం లేదు. తనపై అసత్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో నానా పటేకర్ తనూశ్రీ దత్తాకి నోటీసులు అందించారు.
ఆ నోటీసులు అందుకున్నాక కూడా తనూశ్రీదత్తా తానేం భయపడననీ, ఇప్పటికీ ఆ ఆరోపణలకు కట్టుబడే ఉన్నాననీ, నోటీసుల్ని చట్ట పరంగా ఎదుర్కొంటానిని చెప్పింది. ఆల్రెడీ పలువురు బాలీవుడ్ ప్రముఖులు తనూశ్రీకి అండగా నిలిచారు. అలాగే నానా పటేకర్ అలాంటి వ్యక్తి కాదని ఆయనకూ కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. అయినా కానీ చూడాలి మరి నానాపటేకర్ - తనూశ్రీదత్తా ఇష్యూ ఇలా ఇంకెంత దూరం వెళుతుందో.!