ఆ సీనియర్‌ డైరెక్టర్‌కి బాలయ్య ఛాన్సిచ్చాడా?

By Inkmantra - January 08, 2020 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

కొత్త దర్శకులకు పెద్దగా అవకాశాలివ్వరు బాలయ్య. సీనియర్‌ డైరెక్టర్స్‌నే నమ్ముతుంటారు. చాలా కథలు వింటుంటారు కానీ, కథపై కన్నా, దర్శకుడిపైనే ఎక్కువ నమ్మకం బాలయ్యకు. ఈ సంగతి పక్కన పెడితే, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని కంకణం కట్టుకున్నట్లున్నారు బాలయ్య. గతేడాది ఎన్టీఆర్‌ - కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా ఫలితం జీరో అయ్యింది. తర్వాత 'రూలర్‌' అంటూ జోరు ప్రదర్శించినా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడమే మిగిలింది. ఇక ఇప్పుడు తనకు సూపర్‌ హిట్స్‌ ఇచ్చిన బోయపాటితో హ్యాట్రిక్‌ సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారు.

 

బోయపాటి శీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, మరో సీనియర్‌ దర్శకుడు బాలయ్య లిస్టులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్యకు 'సమరసింహారెడ్డి, 'నరసింహానాయుడు' తదితర సూపర్‌ డూపర్‌ సెన్సేషనల్‌ హిట్స్‌ అందించిన బి.గోపాల్‌ని మళ్లీ తీసుకొచ్చే యోచన చేస్తున్నారట. ఈయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్ల క్రితం గోపీచంద్‌తో 'ఆరడుగుల బుల్లెట్‌' చిత్రాన్ని తెరకెక్కించి పక్కకు తప్పుకున్నారీయన. వాయిదాల మీద వాయిదాలు పడి ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య రూపంలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ జరుగుతున్న ప్రచారం నిజమై, బాలయ్య - బి.గోపాల్‌ కాంబో సెట్టవుతుందేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS