బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈలోగా.. మరి కొన్ని కొత్త కథలు విన్నట్టు, వాటిపై సంతకాలు పెట్టినట్టు జోరుగా వార్తలు వినవస్తున్నాయి. బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుంచో అంటున్నారు. ఇప్పుడు శ్రీవాస్‌కీ ఛాన్స్ ఇచ్చాడన్నది కొత్త వార్తల సారాంశం. బాలయ్య ని డిక్టేటర్ గా చూపించింది శ్రీవాస్‌నే. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే, శ్రీవాస్ ని పిలిచి మరీ బాలయ్య అవకాశం ఇచ్చాడని టాలీవుడ్ కోడై కూస్తోంది.
అయితే అలాంటిదేం లేదని, ఈ కాంబినేషన్ లో సినిమా రావట్లేదని తేలింది. అసలు బాలయ్య - శ్రీవాస్ మధ్య భేటీనే జరగలేదని టాక్. మరి ఈ వార్త ఎలా పుట్టిందో? ప్రస్తుతం బాలయ్య ఫోకస్ అంతా... బోయపాటి సినిమాపైనే. ఈ చిత్రానికి `మోనార్క్` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.