సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరుశురాం కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రం తాజాగా మహేష్ కూతురు సితార చేతుల మీదుగా ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఒకటి అమెరికాలో ప్లాన్ చేసింది యూనిట్. కానీ అక్కడి పరిస్థితులు సహకరించడం లేదని, కరోనా సెకండ్ వేవ్ కూడా విజృంభించడంతో తిరిగి హైదరాబాద్ కు రానుందని సమాచారం.
హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ వేసి అక్కడ ఒక నెల రోజుల పాటు చిత్రీకరణ జరిపే అవకాశాలున్నాయట. ఇప్పటికే ఈ సెట్ నిర్మాణం మొదలుపెట్టారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ మరియు మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ 'కీర్తి సురేష్' నటించనుంది. జనవరి నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.