ఎన్టీఆర్ జీవితం పై ఆయన తనయుడు బాలకృష్ణ ప్రాధాన పాత్రలో దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ మనవడు ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఆ మనవడు ఎవరో కాదు, నందమూరి హరికృష్ణ రెండవ కుమారుడు హీరో కళ్యాణ్ రామ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం చైతన్యరథం పైన ప్రచారానికి వెళ్ళారు. అయితే ఆ రథాన్ని నడిపింది, నందమూరి హరికృష్ణ అవ్వడం, ఇప్పుడు అదే పాత్రని ఆయన తనయుడు పోషించనునుండడం విశేషం.
ఏదైతేనేమి.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై వస్తున్న సినిమాలో ఆయన కుటుంబసభ్యులు కీలక పాత్రలు చేస్తుండడంతో నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలవనుండగా 2018 చివరికల్లా విడుదలకానుంది.