'ఇజం' సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ నటిస్తున్న చిత్రం 'ఎమ్మెల్యే'. పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఇజం' కళ్యాణ్‌రామ్‌ని నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు కళ్యాణ్‌రామ్ ఆశలన్నీ 'ఎమ్మెల్యే' పైనే. ఈ సినిమాకి పోజిటివ్ వైబ్రేషన్స్ పుష్కలంగా కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి.
'ఎమ్మెల్యే' అంటే మొదట్లో ఇదేదో పొలిటికల్ డ్రామా అనుకున్నారంతా. అయితే సబ్జెక్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది కానీ పొలిటికల్ డ్రామా కాదంటోంది చిత్ర యూనిట్. కూల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అట. హాట్ సమ్మర్‌లో కూల్‌గా 'ఎమ్మెల్యే'ని ఎంజాయ్ చేయొచ్చంటున్నారు కళ్యాణ్‌రామ్ అండ్ టీమ్. ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండబోతోందట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాజల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే, కాజల్ మట్టి పట్టుకుంటే బంగారమైపోతోంది. అంత పీక్స్‌లో ఉంది కాజల్ లక్. సో కాజల్ లక్ ఈ సినిమాకి ఓ పోజిటివ్ వైబ్రేషన్ కాగా, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాని రూపొందించిన బ్యానర్‌లోనే ఈ 'ఎమ్మెల్యే' సినిమా రూపొందుతోంది. అది కూడా ఓ ప్లస్ పాయింటే అని చెప్పాలి.
ఈ ప్లస్‌లన్నీ కళ్యాణ్‌రామ్‌కి కలిసొచ్చి, 'ఎమ్మెల్యే'తో హిట్ కొడతాడేమో చూడాలి మరి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న 'ఎమ్మెల్యే' చిత్రాన్ని ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీస్కొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క కళ్యాణ్‌రామ్ 'నా నువ్వే' చిత్రంలో నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌తో జత కడుతోంది.