దీప్తి, గణేష్ & నందిని- ఈ ముగ్గురిలో ఎవరు?

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ సీజన్ 2 ప్రస్తుతం మొదటి అధ్యాయం పూర్తయింది అనే చెప్పాలి. కారణం- 106 రోజుల సీజన్ లో 50 రోజులు దాటిపోవడం ఒకటి అలాగే ఇంటి సభ్యుల గురించి ప్రేక్షకులకి కూడా దాదాపుగా ఒక అంచనాకి రావడం.

అయితే పోయిన వారం నామినేషన్ లేకపోవడం ఆ తరువాత ఇంటి నుండి వెళ్ళిపోయిన వారి నుండి మరో ఇద్దరు ఇంటికి రావడంతో బిగ్ బాస్ హౌస్ మళ్ళీ హౌస్ ఫుల్ అయిందనే చెప్పాలి. కాకపోతే ఈవారం ఈ వారం ఎలిమినేషన్ తప్పనిసరి కాబట్టి ఎవరు ఇంటి నుండి నిష్క్రమిస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఇప్పటికే బాబు గోగినేని, కౌశల్ ఎలిమినేషన్ నుండి సురక్షితులు అవ్వగా ఇంటి నుండి వెళ్ళిపోయే వారు మిగిలిన ముగ్గురిలో ఒకరు అని అర్ధమైపోయింది. ఆ ముగ్గురు- దీప్తి, గణేష్ & నందిని. వీరిలో ఒకరు కచ్చితంగా ఈరోజు ఇంటి నుండి వెళ్ళిపోనున్నారు.

అయితే ఈ ముగ్గురిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నందిని & దీప్తి. ఎందుకంటే వీరిరువురి ప్రవర్తనలు రోజుకొకలాగా ఉంటుండడం అదే సమయంలో ఇంటి సభ్యులతో కూడా ఒకేలా ఉండలేకపోతుండడం కూడా కారణాలు అని ఎక్కువమందిలో ఉన్న అభిప్రాయం.

బిగ్ బాస్ హౌస్ ట్యాగ్ లైన్ ప్రకారం- ఏదైనా జరగోచ్చు బట్టి చూస్తే వీరిరువురు కాకుండా గణేష్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. మరి చూడాలి ఈ ముగ్గురిలో నుండి ఈరోజు బయటకి వచ్చే సభ్యుడు/రాలు ఎవరా అని...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS