నూతన్ నాయుడు పైన తీవ్ర ఆరోపణలు

మరిన్ని వార్తలు

ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించి సీజన్ రెండవ వారంలోనే ఇంటి నుండి బయటకి వచ్చేసిన నూతన్ నాయుడు అనూహ్యంగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు.

అయితే ఆయన ఇంటిలోకి ప్రవేశించగానే బయట ఆయన పైన ఆరోపణల పర్వం మొదలైపోయింది. ఇంతకి ఆ ఆరోపణలు ఏంటంటే-  “ప్రైవేటు యూనివర్సిటీ పెట్టుకునేందుకు అనుమతులను ఇప్పించేందుకు సుమారు రూ3 కోట్లు తీసుకుని ఆ తరువాత ఆ అనుమతులు విషయం గాలికి వదిలేయడం.. అతను ఒక నటిని ఆకర్షించడానికి సుమారు రూ 35 లక్షల వరకు ఖర్చు చేయడం”.

ఈ ఆరోపణలు చేసింది శివ అనే ఓ సామాజిక కార్యకర్త, ప్రైవేటు యూనివర్సిటీ విషయంలో మోసపోయిన వ్యక్తి స్వయాన తన సోదరుడు అని చెప్పాడు. ఈ ఆరోపణల పైన ఇప్పటికే పలు టీవీ చానల్స్ లో డిబేట్లు కూడా ప్రసారమవుతున్నాయి.

ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న నూతన్ నాయుడు పైన ఈ ఆరోపణలు వస్తుండడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS