వరుస చిత్రాలతో నందిని రాయి ఫుల్ బిజీ

మరిన్ని వార్తలు

నందిని రాయ్ ఈ పేరు వినగానే మనకి గుర్తుచ్చే సినిమాలు ఖుషి ఖుషీగా , మోసగాళ్లకు మోసగాడు మరియు సిల్లీ ఫెలోస్. ఇలాంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ 2 లో బెస్ట్ కంటస్టెంట్ గా నిలిచి మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది .తాజాగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న నంది అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే లాల్ భాగ్ అనే మలయాళం మూవీ లో కూడా నటిస్తోంది ఈ తెలుగు హీరోయిన్.

 

ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ లో బిజీ బిజీ గా ఉంది నందిని. ఇవి కాకుండా మలయాళం లో కూడా ఒక అద్భుతమైన అవకాశం కూడా వచ్చింది.ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోతోంది నందిని.మంచి కథ ఉంటే నేను ఆ సినిమా ని వదులుకోను అని చెప్పింది . నాకు భాష లతో సంబంధం లేదు సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కథ నచ్చితే చాలు ఏ భాషలో ఐనా సినిమాలు చేయడానికి నేను రెడీ గా ఉన్నా అని చెప్పింది.ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి మరియు తన లైఫ్ గురించి చాలా హ్యాపీ గా ఉన్నానని తెలిపింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత మరిన్ని వివరాలు తన సోషల్ మీడియా పేజీ లో తెలియచేస్తానని చెప్పింది. మలయాళం లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం లాల్ బాగ్. ఈ చిత్రంలో తెలుగు సహజ నటి అయిన నందినీ రాయ్ హీరోయిన్ గా నటిస్తోంది . మరియు హిందీలో నందీ అనే సినిమాలో కూడా నటిస్తోంది .

 

ఇప్పటికే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు తమిళం,మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్ . బాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాక్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఈ సుందరి అనతికాలంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం 040. ఇక ఆ తర్వాత వచ్చిన మాయ,మోసగాళ్ళకు మోసగాడు,సిల్లీఫెలోస్ సినిమాలతో తక్కువ కాలంలోనే తన మార్క్ ని చూపించింది. ఇక మళయాలం, కన్నడ లో నటించిన గుడ్ బాయ్ డిసెంబర్,ఖుషి ఖుషి యాగీ సినిమాలతో పాటు మరికొన్ని ఆఫర్స్ లను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోకి తిరిగి అడుగుపెట్టబోతున్న నందిని రాయ్ అక్కడి ప్రేక్షకులను ఏమేరకు అలరించబోతుందో చూడాలి.తాను ఇప్పుడు చేస్తున్న సినిమాలు తనకి మంచి పేరు తీసుకొస్తాయని గట్టిగా చెప్తోంది నందిని రాయ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS