ఎన్ని అడ్డంకులొచ్చినా, అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోయినా నిఖిల్ నిలదొక్కుకోగలిగాడు. నవంబర్ 29న 'అర్జున్ సురవరం' సినిమాతో సోలోగా వచ్చి సక్సెస్ కొట్టాడు. దాంతో నిఖిల్ ఆశలకు కొత్త చిగురులు తొడిగాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ జోష్‌తో నిఖిల్ జోరు పెంచాడు. తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. చాలానే ప్రాజెక్టులు నిఖిల్ స్టార్ట్ చేసి ఉంచాడు. ఒక్కొక్కటిగా వాటిని పూర్తి చేసే యోచనలో ఉన్నాడట. అంతేకాదు, నిఖిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'కార్తికేయ 2' పైనా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. త్వరలోనే ఈ విషయమై పూర్తి వివరాలు వెల్లడిస్తానంటున్నాడు నిఖిల్.
ప్రస్తుతం 'అర్జున్ సురవరం' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా, కలెక్షన్లు జోరు చూపిస్తోంది. ఈ సీజన్‌లో వచ్చిన సినిమాలన్నింట్లోనూ 'అర్జున్ సురవరం' మంచి వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ వారం 'వెంకీ మామ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సో 'వెంకీ మామ' వచ్చే వరకూ 'అర్జున్ సురవరం' దూకుడు ఆగేలా లేదంటున్నారు. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటించిన సంగతి తెలిసిందే.