మెగాహీరోని పట్టేసిన సమంత డైరెక్టర్‌!

మరిన్ని వార్తలు

అందమైన ప్రేమకథలకు హాస్యాన్ని చొప్పించి అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకర్షించేలా సినిమాలు తెరకెక్కించగల టాలెంటెడ్‌ లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి. 'ఓ బేబీ' సినిమాతో నందినీ రెడ్డి బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకోవడంతో పాటు, అందరి ప్రశంసలు అందుకుంది. నటిగా సమంతకే కాదు, దర్శకురాలిగా ఆమె కెరీర్‌లోనూ బెస్ట్‌ ఫిలింగా 'ఓ బేబీ' ఎప్పటికీ నిలిచిపోతుంది. 'ఓ బేబీ' తర్వాత నందినీ రెడ్డి ఖాతాలో ఓ మెగా హీరో చేరనున్నాడట. ఆయన ఎవరో కాదు, 'ఉప్పెన'తో డెబ్యూ చేస్తున్న వైష్ణవ్‌ తేజ్‌.

 

సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడైన వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా 'ఉప్పెన' సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ లోగా మన హీరోని దృష్టిలో పెట్టుకుని నందినీ రెడ్డి ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని సిద్ధం చేశారట.

 

ఈ స్టోరీ లైన్‌ని మెగా ఫ్యామిలీకి చేరవేయగా, వైష్ణవ్‌ తేజ్‌కే ఆ స్టోరీని అందరూ పాస్‌ చేశారట. సో నందినీ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ అలా కన్‌ఫామ్‌ అయిపోయాడనీ ఫిలిం వర్గాల సమాచారం. ఇంకా డెబ్యూ చేయకుండానే ఈ మెగా హీరో రెండో అవకాశాన్ని కూడా దక్కించుకోవడం గొప్ప విషయమే. అయితే పూర్తి వివరాల కొరకు కొంత సమయం వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS