హాట్‌ హాట్‌ నందితా అంతకుమించి.!

By iQlikMovies - August 02, 2018 - 16:18 PM IST

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ కుట్టి నందితా శ్వేతా. అందానికి అందం, అభినయానికి అభినయం తొలి సినిమాతోనే నటిగా తానేంటో ప్రూవ్‌ చేసుకుంది. మంచి సక్సెస్‌ కూడా దక్కించుకుంది. అయితే రెండో సినిమాకి చాలా గ్యాప్‌ తీసుకుంది. తాజాగా 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తొలి సినిమాలో పర్‌ఫామెన్స్‌ చూపించిన ఈ ముద్దుగుమ్మ ఈ సారి గ్లామర్‌ యాంగిల్‌ చూపించేందుకు రెడీ అయిపోయిందట. రాశీఖన్నా, నితిన్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా శ్వేతా కీలక పాత్ర పోషిస్తోంది. ఆ పాత్ర పక్కా గ్లామరస్‌ క్యారెక్టర్‌ అనీ తెలుస్తోంది. బీభత్సమైన గ్లామర్‌ అప్పీల్‌ ఉంటుందట. అయినా తొలి సినిమాలో క్యారెక్టర్‌కి తగ్గట్లుగా అలా కనిపించింది కానీ, అమ్మడిలో గ్లామర్‌ యాంగిల్‌ పుష్కలంగా కనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి ఈ పిక్‌లో హాట్‌ హాట్‌ గ్లామర్‌తో నందితా ఎలా మెరిసిపోతోందో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS