మెగా డాటర్ నిహారిక నటించిన రెండు సినిమాలు నిరాశపరిచాయి. శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో నటిస్తోంది తదుపరి నిహారిక. తొలి సినిమా 'ఒక మనసు' చిత్రంతో తనకు సూటయ్యే స్టోరీ ఎంచుకోలేదని కామెంట్లు వచ్చాయి. దాంతో చాలా గ్యాప్ తీసుకుని ఇటీవల 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ స్టోరీలోనూ నిహారిక డల్ అప్పీల్‌నే ప్రదర్శించింది. పెళ్లి ప్రధాన కధాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పెళ్లికూతురుగా నిహారిక తీసుకునే నిర్ణయాలు కథను ఎలా మలుపు తిప్పాయనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఎందుకో ఈ సినిమాతోనూ నిహారికకు పోజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాంతో 'హ్యాపీవెడ్డింగ్' కూడా హిట్ లిస్టులో చేరలేకపోయింది.
ఇక నుండైనా ఎంచుకునే కథల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది. మెగా బ్రాండ్ ఎలాగూ ఉంది కదా, నెట్టుకెళ్లిపోవచ్చులే అనుకుంటే సరిపోవడం లేదు. స్టోరీ ఇంప్రెస్ చేయకపోతే ఈజీగా అభిమానులు రిజక్ట్ చేసేస్తున్నారు. అదే నిహారిక విషయంలో జరిగింది. నిహారికతో పాటు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌దీ ఇదే పరిస్థితి. తనకు తగ్గ కథలను ఎంచుకోవడంలో తేజు కూడా వెనకబడిపోయాడు.
'సుప్రీమ్' వరకూ ఫాస్ట్‌గా సాగిన తేజు కెరీర్ తర్వాతి నుండి వరుసగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మరింత దుర్భర స్థితికి చేరుకుంది. రేసులో దూకుడు ప్రదర్శించాలంటే ఇటు తేజు, అటు నిహారిక ఇద్దరూ కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదా. కుటుంబ సభ్యుల నుండి అవరసరమైన సూచనలు సలహాలు తీసుకోవడమైనా జరగాలి. లేకుంటే హిట్ కష్టమే.