'చిన్నదాని' గ్లామర్‌ చూస్తారా?

By iQlikMovies - July 31, 2018 - 12:57 PM IST

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన బ్యూటీ నందితా శ్వేతా. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. కానీ స్టోరీ కాన్సెప్ట్‌ అంతా ఆమె చుట్టూనే తిరుగడంతో, ఆ సినిమాకి నందితా శ్వేతనే మెయిన్‌ హీరోయిన్‌ అని చెప్పొచ్చు. అలాగే పాత్రకు తగ్గట్లు యాక్టింగ్‌ టాలెంట్‌ కూడా ప్రదర్శించింది. అయితే ఆ సినిమాలో గ్లామర్‌కి ఛాన్స్‌ లేకుండా పోయింది. అలా అని తానేమీ గ్లామర్‌కి దూరం కాదంటోంది. ఇకపోతే ప్రస్తుతం నందితా శ్వేత 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తోంది. నితిన్‌ - రాశీఖన్నా జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా శ్వేత గ్లామర్‌ రోల్‌ పోషించనుందని తెలుస్తోంది. అందుకు శాంపిల్‌ అన్నట్లుగా సోషల్‌ మీడియాలో నందితా శ్వేత పోస్ట్‌ చేసిన ఈ ఫోటోని బట్టి అర్ధమవుతోంది. చూస్తున్నారుగా అమ్మడిలోని గ్లామర్‌ యాంగిల్‌. అదీ సంగతి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS