'సాహో'లో పూజా హెగ్దే.!

By iQlikMovies - July 31, 2018 - 12:53 PM IST

మరిన్ని వార్తలు

ప్రబాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ మూవీ 'సాహో' కోసం హాట్‌ బ్యూటీ పూజా హెగ్దేని హీరోయిన్‌గా ఎంచుకున్నారట. అదేంటీ, ఆల్రెడీ 'సాహో'లో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది కదా అనుకుంటున్నారా? అవును నిజమే. శ్రద్ధాకపూర్‌ హీరోయినే. అయితే మరో ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం తాజాగా పూజా హెగ్దేని అనుకుంటున్నారట. టెస్ట్‌ షూట్‌ కూడా చేశారనీ తెలుస్తోంది. యాక్షన్‌ బేస్‌డ్‌ మూవీ ఇది. పూజా కటౌట్‌కి తగ్గ పాత్రట అది. 

ఈ మధ్యనే పూజా హెగ్దే 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయిది. దీంతో పూజా హెగ్దేకి క్రేజ్‌ తగ్గిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ పూజా స్టార్‌ హీరోలైన ఎన్టీఆర్‌, మహేష్‌లతో కలిపి ప్రబాస్‌తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్‌తో పూజా చేస్తున్న 'అరవింద సమేత వీర రాఘవ' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ - వంశీ పైడిపల్లి కాంబోలో చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ సినిమాకి ఎప్పుడో పూజా హెగ్దేని హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసేశారు. 

అలాగే ప్రబాస్‌ - రాధాక్రిష్ణ కాంబో మూవీకీ పూజానే హీరోయిన్‌. కాగా అంతకు ముందే ప్రబాస్‌తో 'సాహో'లో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది పూజా హెగ్దే. ఈ స్థాయిలో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్‌ ఉంటే, క్రేజ్‌ తగ్గిపోవడమేంటి అంటూ ఆమె అభిమానులు ఆ గాసిప్స్‌ని కొట్టి పడేస్తున్నారు. దసరాకి ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత..' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది పూజా హెగ్దే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS