దెయ్యాలంటే అందరికీ భయమే. కానీ హారర్ చిత్రాలను చూడ్డం అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే హారర్ చిత్రాలు చూడడం అంటే నేచురల్ స్టార్ నానికి కూడా ఎంతో ఇష్టమంట. చూస్తాడు కానీ హారర్ చిత్రాల్లో మాత్రం నటించనంటున్నాడు మనోడు.
ఎంత మంచి స్టోరీ అయినా, డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా సరే చచ్చినా హారర్ మూవీస్‌లో నటించననీ ఖచ్చితంగా చెప్పేస్తున్నాడీ హీరో. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు హారర్ చిత్రాల్లో నటించారు. కొందరు సక్సెస్ అయ్యారు. మరికొందరు ఫెయిల్యూర్ అయ్యారు. అయితే కొత్తదనం కోసం అటెంప్ట్ అయితే చేశారు. కానీ నాని మాత్రం ఎప్పటికీ హారర్ అటెంప్ట్ చేయనంటున్నాడు. అవును నిజమే నాని అంటే మన పక్కింటి అబ్బాయి. మన పక్కింటి అబ్బాయి హోమ్లీగా కనిపిస్తూ, ఎంటర్టైన్ చేస్తేనే చూడగలం. భయపెడితే చూడడం మనకీ కష్టమే. ఇటీవలే 'ఎంసీఏ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని.
వరుస సక్సెస్‌లతో జోరు కొనసాగిస్తున్న నాని ఎప్పటిలాగే ఈ సారి కూడా హిట్ అందుకున్నాడు. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నా కానీ తన కాళ్లు ఎప్పుడూ నేలనే తాకుతూ ఉంటాయంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఎప్పుడూ నేను మిడిల్ క్లాస్ అబ్బాయినే అంటున్నాడు. సినిమాల్లోనే కాదు, తన మాటలతో బయట కూడా అభిమానాన్ని పెంచుకున్నాడు నాని.
స్టార్ హీరోలతో సమానంగా స్టార్డమ్ సంపాదించుకున్నాడు. నాని ఆటిట్యూడే నానిని ఈ స్థాయిలో నిలిపేందుకు దోహదపడిందని చెప్పొచ్చు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో నానికి జోడీగా సాయిపల్లవి నటించింది.