షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ని లైంగికంగా వేధించిన దర్శకుడి కేసు పూటకి ఒక మలుపు తిరుగుతున్నది.
హారిక అనే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ తనని డైరెక్టర్ యోగి వేధిస్తున్నాడు అని గచ్చిబౌలి పోలీసులని ఆశ్రయించింది. దీనితో యోగిని పోలీసులు స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా యోగి పైన పోలీస్ అధికారి కాలితో తన్నిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది. అసలు ఈ మొత్తం విషయంలో ఏం జరిగింది అన్నది దర్శకుడు యోగి ఒక టీవీ ఛానల్ లో చెప్పినట్టు తెలుస్తున్నది.
హారికతో కలిసి తానెప్పుడూ పనిచేయలేదని, ఒక ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం అయిందని తెలిపాడు. అయితే ఈ పూర్తి వివాదానికి కారణం రూ 10,000/-అని చెప్పుకొచ్చాడు యోగి. గతంలో తమ మధ్య స్నేహం ఉండేది అని అయితే ఒక సందర్భంలో హారిక వ్యక్తిగత విషయాలు బయటకి రావడం జరిగిందని, అవి తన వల్లనే అని అపార్ధం చేసుకుని తన గురించి హారిక అందరికీ చెడుగా చెప్పడం మొదలుపెట్టిందని చెప్పాడు.
ఇక తనని అలా రెచ్చగొట్టిన కారణంగానే తాను అసభ్యంగా మెసేజ్ చేయవలసి వచ్చింది అని తెలిపాడు. అయితే తాను పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు తీసిన వీడియో తాను తీయలేదు అని ఆ వీడియో కూడా హరికనే తీసింది అని చెప్పుకొచ్చాడు.