'కృష్ణార్జున యుద్ధం' సినిమాని ఫ్లాప్ అని తేల్చేశాడు నాని. ఫ్యాన్స్ ఎవరో ఈ సినిమాని హిట్ సినిమాగా అభివర్ణించారట. అయితే ఈ సినిమా హిట్ కాదు, ఫ్లాప్ అని డైరెక్ట్‌గా నానినే తేల్చేశాడట. అయితే కొంచెం కొత్తగా ఉండాలని చాలా కష్టపడి సినిమా చేశాం. కానీ ప్రేక్షకలు అంతగా ఈ సినిమాని రిసీవ్ చేసుకోలేకపోయారు అని నాని అన్నాడు.
నానిలో మెచ్చుకోదగ్గ విషయం ఇదే. ఏ విషయాన్ని అయినా సూటిగా ఒప్పుకుంటాడు. అందుకే నాని నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. హిట్ సినిమాని హిట్ సినిమా అని ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆడియన్సే నిరూపిస్తారు. ఫ్లాప్ సినిమా అయితేనే హిట్‌గా ప్రచారం చేసుకోవాలి. ప్రచారం జరిగినంత మాత్రాన ఆ సినిమా హిట్ అయిపోవాలనే రూలు లేదు. 'భలే భలే మగాడివోయ్' సినిమా దగ్గర్నుంచీ నానికి తిరుగే లేదు. ఏది పట్టుకుంటే అదే బంగారమైపోతోంది.
అయితే ఈ సారి మాత్రం నానికి కాస్త చుక్కెదురైందనే చెప్పాలి. ఎందుకో 'కృష్ణార్జున యుద్ధం' ఆడియన్స్‌ని మెప్పించలేకపోయింది. ఎప్పటిలానే నాని కష్టపడ్డాడు కానీ, రిజల్ట్ ఎప్పటిలా రాకపోయింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయంలో నటించాడు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా నటించారు.
నాని నటించిన చిత్రాల్లో మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విషయంలో మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. 'దారి చూడు..' అనే జానపదం తప్ప మిగిలిన పాటలు అంతగా ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. టోటల్‌గా సినిమా ఫ్లాప్ అని నానినే ఒప్పుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. అంతే.! ప్రస్తుతం నాని, నాగార్జునతో మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.