ఎక్కడ చూసినా ఇప్పుడు #IPL ఫీవర్ తో అందరు ఊగిపోతున్నారు. అలా IPL క్రేజ్ తో తడిసి ముద్దవుతున్న వారిలో మన సినీ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, నిన్న IPL క్వాలిఫయర్ 2లో భాగంగా హైదరాబాద్-కోల్ కత్తా మధ్య జరిగిన మ్యాచ్ లో సంచలన ఆల్ రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ టీం ని ఫైనల్ కి చేర్చాడు రషీద్ ఖాన్. బౌలింగ్, బ్యాటింగ్ & ఫీల్డింగ్ విభాగాల్లో రషీద్ చేసిన ప్రదర్శనకి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అయిపోయారు.
ఆ ఫ్యాన్స్ లో తాజాగా హీరో మహేష్ బాబు కూడా చాలా బాగా ఆడావు, నీ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అని ట్వీట్ చేశాడు. ఇక దీనికి వెంటనే రషీద్ ఖాన్ బదులిస్తూ- మీ సినిమాలు నేను చూస్తుంటాను, చాలా బాగుంటాయి అని కితాబు ఇచ్చాడు.
ఈ ఇరువురి ట్వీట్లతో ఇరువురి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక IPL ఫైనల్ కి చేరిన హైదరాబాద్ టీం కి మా తరపున గుడ్ లక్ చెబుతున్నాం.