నాని - ఇంద్రగంటి చాలా స్పీడుగా ఉన్నారు.!

By iQlikMovies - April 29, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త వ్యూహం మొదలైంది. అదేనండీ ఇంద్రగంటి మోహన్‌కృష్ణతో నాని నటిస్తున్న సినిమాకి టైటిల్‌ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 'వి' అనే డిఫరెంట్‌ టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. వెరీ లేటెస్ట్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది.

 

ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ అంతా సరదాగా కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్నాడని తెలిసిపోయింది. గెటప్‌ పరంగా కూడా డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు నాని. పొడుగాటి మీసాలు, లైట్‌గా గెడ్డంతో, సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ పోషిస్తున్న సుధీర్‌ బాబు లుక్‌ కూడా కొత్తగా ఉంది. లాంగ్‌ హెయిర్‌ స్టైల్‌లో సుధీర్‌ బాబు కనిపిస్తున్నాడు. ఇకపోతే ఇదో మైండ్‌ గేమ్‌ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమనీ తెలుస్తోంది. ఇంద్రగంటి, నానితో ఓ సరికొత్త ప్రయోగమేదో చేయబోతున్నాడని టైటిల్‌ని బట్టి తెలుస్తోంది. అయితే టైటిల్‌ 'వి' అనేది హీరోకి సంబంధించిన విక్టరీనా,? విలన్‌కి సంబంధించిన విలనిజమా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్‌ మొత్తం నాని క్యారెక్టర్‌ వైపు నుండే ఉండబోతోందనీ టాక్‌. నివేదా థామస్‌, అదితీ రావ్‌ హైదరీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురూ గతంలో ఇంద్రగంటితో పని చేసిన వారే కావడం విశేషం. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు సినిమాని కూడా ప్రారంభించేశారు.

 

ఇక రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా త్వరలోనే స్టార్ట్‌ చేసి, వీలైనంత ఎర్లీగా సినిమాకి కంప్లీట్‌ చేయనున్నారట. ఇటీవల 'జెర్సీ' సక్సెస్‌తో నాని సూపర్‌ జోష్‌ మీదున్నాడు. అదే జోష్‌ని 'వి' కోసం కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట. మొత్తానికి నాని కెరీర్‌లో 'వి' ఓ మైలురాయిగా నిలబడిపోతుందనడం అతిశయోక్తి కాదేమో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS